Followers

క్రీడలతో స్నేహ భావం ఏర్పడుతుంది

 క్రీడలతో స్నేహ భావం ఏర్పడుతుంది...

 బిజెపి అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి

 బేలా,  పెన్ పవర్

 క్రీడలతో స్నేహ భావం ఏర్పడి, మానసిక ఉల్లాసం లభిస్తుందని ఆదిలాబాద్ బిజెపి పార్టీ అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి  అన్నారు. శుక్రవారం బేల మండలంలోని సాంగిడి గ్రామంలో  పాయల్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ముఖ్యఅతిథిగా ఆయన హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యన్ని వెలికితీయడానికి  ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ క్రీడాకారులు  గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆటలు ఆడాలని పేర్కొన్నారు. పాయల్ పౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని గ్రామాలలో గ్రామీణ క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బిజెపి యూత్ అధ్యక్షులు పద్మ వార్ రాకేష్, జైనథ్ ఉప సర్పంచ్ వై. రాకేష్ రెడ్డి, జైనథ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ గేడం తరుణ్,  మండల బిజెపి నాయకులు దార్నె జీవన్, కధరపు ప్రవీణ్, అశోక్, ఉషన్న, బిజెపి పార్టీ యూత్ లీడర్ లు,  కార్యకర్తలు, గ్రామస్తులు,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...