భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఆర్. కె.బీచ్ వద్ద స్వచ్చ భారత్ కార్యక్రమము
విశాఖ తూర్పు,పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అధ్యర్యం లో మరియు రాజ్యసభ సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జి.వి.ల్. నరసింహారావు పర్యవేక్షణ లో బీచ్ లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నరసింహా రావు మాట్లాడుతూ.... ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలు చేసేటప్పుడు మంచి స్పందన వచ్చిందని, ఇటువంటి అద్భుతమైన బీచ్ పరిసరాలను శుభ్రంగా, అందంగా ఉంచక పోతే ప్రగతికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో నగర కార్పొరేషన్ వారి వైఫల్యం స్పష్టంగా కబడుతుందని వాపోయారు. ఇక్కడకు ఎక్కువగా సందర్శకులు వేలా సంఖ్యలో వస్తుంటారాని, అందులో విదేశీయుల కూడా ఎక్కువగా వస్తుంటారని కనుక బాధ్యత తో పట్టణ వాసులు ఎవరూ కూడా వ్యర్థాలను , ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధిత వ్యర్థాలను బీచ్ లో ఎక్కడ పడితే అక్కడ పడవేయ కుండా చూసుకోవాలని ప్రాధేయ పడ్డారు. దీనికి అనుగుణంగా కార్పొరేషన్ వారు కూడా భాద్యత గుర్తెరిగి ఎక్కడి కక్కడే డస్ట్ బీన్ లను ఏర్పాటు చేసి స్వచ్చంద సంస్థల వాలంటీర్ ల ద్వారా సందర్శకులెవ్వరూ వ్యర్థాలను కింద పడవేయ కుండా కంట్రోల్ చేయవచ్చని సలహా ఇచ్చారు. ఈ సుందర మైన బీచ్ ను ఇంకా అతి సుందరంగా తయారు చేయొచ్చని ఈ విషయంపై పార్లమెంట్ లో రాజ్యసభలో ప్రస్తావాన తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం లో త్యరలో జరగబోయే కార్యక్రమానికి ఢిల్లీ నుండి కేంద్ర పట్టణ శాఖా మంత్రి హరదీప్ పురి నగరంలో స్మార్ట్ సిటీ కు సంబంధించిన అభివృద్ధిని పర్యవేక్షిస్తారని తెలిపారు. కేవలం నిధులను వాడుకోవాడమే కాదు..వాటిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దామా ? ..లేదా..? అన్నది ముఖ్యం అని హితవు పలికారు. వెనువెంటనే తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దాలందరూ బీచ్ లో పడివున్న వ్యర్థాలను ఏరివేసి సుందరంగా తీర్చిదిద్దారు. తదుపరి ఓ.ఎం.సి. దగ్గరున్న చిల్డర్న్స్ పార్క్ ను కూడా పరిశీలించారు. పార్కు లో సరైన క్వాలిటీ లేని మెటీరియల్ ను వాడడం వలన పిల్లలకు ఆడుకోవడానికి అనుకూలంగా లేకుండా పోయిందని విచారించారు. అక్కడినుండి అప్పుగర్ దగ్గరున్న డివిస్ ప్లాంట్ కు వెళ్లి దానిని పరిశీలించి వేస్ట్ వాటర్ ప్రాసెస్ యొక్క వివరాలను ఆరాతీశారు. ప్లాంట్ ద్వారా వచ్చే వ్యర్ధమైన నీటిని వృధా పోనివ్వ కుండా దానిని ఏవిధంగా ప్రయోగించొచ్చో అనే దానిపై లోకల్ కమిటీని విచారించ మన్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె. సుబ్రమణ్యం 18 వ వార్డు జనసేన బి.జె.పి. ఉమ్మడి పార్టీ అభ్యర్థి ని ద్వారాపురెడ్డి వి.ఎ న్. ఎల్. అరుణ కుమారి, వార్డు అధ్యక్షు లు శ్యామ్ కుమార్ జనరల్ సెక్రటరీ రమా దేవి, ఉదయ్, నూకరాజు,రామ రావు లలితకుమారి మరియు బి.జె.పి కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment