Followers

ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ తో పోరాడు తా

 ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ తో పోరాడు తా

విశాఖ ద్వారాకనగర్, పెన్ పవర్  

న్యాయవాది మరియు 55 వ వార్డు మహిళా  కార్పొరేటర్  కె.వి.ఎన్. శశికళ  సీనియర్ న్యాయవాది మరియు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర  అధ్యక్షులు ఐ. ఎమ్. అహ్మద్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయాన విశాఖ పోర్ట్  కాలుష్యం , వాహన కాలుష్యం ,  ఆహార కల్తీ , పండ్లకు కార్బయిడ్ ను, కూరగాయలకు రసాయనాలను ఉపయోగించి పండించడం ,  తదితర ప్రజాసమస్యలపై న్యాయ పోరాటం చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిగా కార్పొరేషన్ తో పోరాడుతానని గంటా పదం గా హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఐ. ఎమ్. అహ్మద్ మాట్లాడుతూ....ఉన్నత విద్యను అభ్యసించి మహిళా న్యాయవాదిగా ఉండి కార్పొరేటర్ గా గెలిచిన కె.వి.ఎన్. శశికళ కు ఏక్సిక్యూటివ్ కాపిటల్  అయిన విశాఖ కార్పొరేషన్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానాన్ని  కల్పించాలని తద్వారా విద్యావేత్త గా, న్యాయవాదిగా,  సంఘ సేవకురాలిగా శశికళ సేవల ప్రజలకు మరింత ఉపయోగకరంగా వుంటాయని  సూచించారు. శశికళ సమస్యల పరిష్కారానికి  చూపిన చొరవను  ఐ. ఎం. అహ్మద్ ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బైపా అరుణ్ కుమార్ అద్వర్యం లో సీనియర్ న్యాయవాదులు  చిన్నా రావు , బోసు , పైలా శ్రీను , తదితరుల అద్వర్యం లో కార్పొరేటర్ శశికళ ను ఘనంగా సన్మానించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...