వాసవి సేవాదళ్ టీమ్ ను అభనందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
పెన్ పవర్, కందుకూరు
కందుకూరు వాసవి సేవాదళ్ టీం కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పేదవారికి ఆహరం, నిత్యావసర సరుకులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు గత ఆదివారం విజయవాడ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు కళానికేతన్ లో ఆదరణ చారిటీస్ సమర్పణలో వేదిక క్రియేటివిటి,కల్చరల్ టాలెంట్ అండ్ వెరియస్ కిల్స్ సొసైటీ,24క్రాఫ్ట్స్, విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదిక తెలుగు నంది జాతీయ పురస్కారం వాసవి సేవాదళ్ టీం తరుపున ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు నంది అవార్డు తీసుకొన్నారు. ఈసందర్బంగా కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ని కందుకూరు వైస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం లో మహీధర్ రెడ్డిని కలసిన వాసవి సేవాదళ్ టీం సభ్యులు ఈ సందర్బంగా శాసన సభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో వాసవి సేవాదళ్ టీమ్ సభ్యులు నిరంతరం కరోనాను సైతం లెక్కచేయకుండా సేవాకార్యక్రమం చేశారు.వారికి ఈ నంది పురస్కారం రావడం చాలా సంతోషదాయాకమని, భవిష్యత్ లో ఇలాగే సేవలో ముందుకు కొనసాగాలని ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ కరోనా సమయం లో కందుకూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూ,మనోధైర్యాన్ని కాల్పించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేశామని,రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు మా టీమ్ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని, ఈ నంది పురస్కారం మా దాతలకు అంకితం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఆర్యవైశ్య నాయకులు పబ్బిశెట్టి శివ,చలంచర్ల సుబ్బారావు,ఇస్కాల మధు, శ్రీ రామసాయి సేవా సమితి అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీను, మానేపల్లి బుచ్చయ్య గుప్తా, సోమిశెట్టి శశాంక్, పాదర్తి వెంకట అమరనాధ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment