Followers

జగనన్న ఆలోచనే..దొరన్న ఆచరణ

 జగనన్న  ఆలోచనే..దొరన్న ఆచరణ

జగ్గంపేట,పెన్ పవర్

 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దవులూరి దొరబాబు విశ్వాసానికి..విధేయతకు పర్యాయ పదంగా మారిపోయాడు  జగనన్న చెప్పిందే వేదం చూపిందే ఆయనకు మార్గం ఇదీ దొరబాబు నైజం.. 2019 సార్వత్రిక ఎన్నికలలో చివరి క్షణంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ మరొకరికి మార్చినప్పుడూ అదే చిరునవ్వు.. అదే విధేయత.. అదేవిశ్వాసం... తర్వాత జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదివిలో ఆఖరు నిమిషంలో వేరే వారిని కూర్చోబెట్టినా అదే చిరుమందహాసం.. అదే గుండె నిబ్బరం...జగనన్న పట్ల అదే విశ్వాసం పార్టీ బలోపేతం పట్ల అదే నిబద్దతతో కూడిన కృషి.. సర్వేలు సైతం పెద్దాపురం నియోజకవర్గంలో గల రెండు మున్సిపల్ చైర్మన్ పీఠాలను  టి.డి.పి కైవసం చేసుకుంటుందని చెప్పినా.. సొంత పార్టీ లోని వ్యక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా ఇంచార్జి పదవికోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూసే నాయకులు ఎన్ని రాజకీయాలు చేసినా  ఎక్కడా అదరక.. బెదరక.. చెదరక..ముందుండి తన క్యాడర్ ను మున్సిపల్ ఎన్నికలలో విజయతీరాలకు చేర్చిన నాయకుడు... సామర్లకోట పట్టణం..  పెద్దాపురం నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లా అంతా దొరబాబు గారి తల్లి గారు శ్రీమతి పార్వతి గారు చైర్మన్ పీఠం అధిరోహిస్తున్నారని దృఢవిశ్వాసంతో అదే నిజమని అభినందనలు అందిస్తూ .. సంబరాలు చేసుకొంటున్న వేళ మళ్లీ అదే... నిరుత్సాహ పరిచే వార్త ... చైర్మన్ పదవి మీ తల్లిగారికి కాకుండా వేరే వారికి ఇవ్వమని సాక్షాత్తు ప్రియతమ ముఖ్య మంత్రి వర్యులు వై.ఎస్.ఆర్. పార్టీ అధినేత జగన్ మోహన్  రెడ్డి చెప్పగానే చిరునవ్వుతో ఓ.కె. అని చెప్పి తన విధేయతను జగన్ పట్ల విశ్వసనీయతను ప్రకటించిన దొరబాబు కు యావత్ ప్రజానీకం వై.ఎస్.ఆర్. క్యాడర్ మొత్తం సెల్యూట్ చేస్తుంది.. నాయకుడంటే తనకోసం కాకుండా తన పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాలకోసం ఎన్ని త్యాగాలనన్నా చేయవలసి ఉంటుందని తన నడవడిక ద్వారా మనసా..వాచా.. కర్మణా .. ఆచరించి చూపిన దొరబాబు నిజంగా విధేయతకు విశ్వాసనీయతకు నిలువెత్తు నిదర్శనం కాదనగలమా... యావత్  జిల్లా ప్రజానీకం మొత్తం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవ..కార్యకర్తలతో చర్చించి తీసుకొనే సముచిత నిర్ణయాలు, అధికారులను గౌరవిస్తూ  నియోజక అభివృద్ధికి ఆయన అధికారులతో సమన్వయం అవుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడంలో చూపే చొరవ.. అవినీతికి.. లంచగొండి తనానికి తావీయక చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల యావత్ జిల్లా ప్రజానీకం నాయకుడంటే దొరబాబే అనే విధంగా మన్ననలు పొందుతున్నా.. ఆయనకు అధినాయకుడు మరో పిడుగులాంటి వార్త చెప్పినా ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా శిరోధార్యం గా భావించే నైజం దొరన్నకే  సొంతం   శ్రీమతి దవులూరి పార్వతి గారు సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవిని అలంకరిస్తున్నారు అని అందరూ సంతోషిస్తున్న తరుణంలో కాదు జగనన్న ఆదేశం ఇది అని తెలిసిన మరుక్షణం జనం ఆవేశం ఆపటం దొరబాబుకు సైతం సాధ్యం కాలేదు.యావత్ జిల్లా ప్రజానీకం ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని భరిస్తావని కొందరు.. నీకు బాధగా లేదా మాకు గుండెలు మండిపోతున్నాయి అని కొందరు.. సొంత డబ్బు ఖర్చుపెట్టడం కాదు ప్రజల డబ్బు దోసుకొనేవాడే కావలి ఈ నాటి రాజకీయాలకు అని మరికొందరూ.. నీ వ్యాపారాలు.. కుటుంబాన్ని వదిలి వస్తే గుర్తింపు ఇవ్వని ఈ పార్టీలో ఎందుకు అని రకరకాల జనాల మాటల తూటాలతో పొడుస్తున్నా.. ఔరా ఎంత అన్యాయం అని ప్రత్యర్దులు సైతం ఆందోళన చెందుతుంటే.. చిరునవ్వుతో జగనన్న నాకు అన్యాయం చేయడు తన తమ్మునివలె నన్ను గుండెలకు హత్తుకుని చెప్పాడు నాకు. సరైన సమయంలో సరైన స్థానంలో కూర్చోపెడతాడు నన్ను.  నాకు నమ్మకం ఉంది. అని జగన్మోహనునిపై  అదే దృఢవిశ్వాసం తో నమ్మకంతో చిరునవ్వుతో చెప్పే ఆయన మాటలు వింటే మెంటల్ ఎక్కిపోతుంది.. గుండె తరుక్కుపోతుంది.. సొంత కుటుంబ సభ్యుని కోల్పోయినా బాధ నంతా గుండె పొరల్లో అదిమిపట్టి తన నియోజకవర్గంలో ప్రజలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిన వైనం.. కరోనా బారిన పడి బాధపడుతున్న కుటుంబ సబ్యులకు నిత్యవసర వస్తువులు అందించి ఆదుకున్న వైనం. నియోజకవర్గంలో సొంత ఖర్చుతో నీటి సరఫరా చేస్తున్న సంగతి.. ఆపదని వచ్చిన వాడికి అడిగిందే తడవుగా ఆపన్న హస్తం అందించిన సందర్భాలు.. సొంత పైకం వెచ్చించి చేసిన ఎన్నో ఎన్నెన్నో పనులు.. ఇవి ఏవీ అధినాయకుణ్ణి చేరలేదా, ఆయన సేవలు గుర్తించలేదా. అని వై.ఎస్.ఆర్. కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.అయినప్పటికీ దవులూరి దొరబాబు ను ఈ విషయాలపై వివరణ కోరగా అయన చెప్పే ఒకే ఒక మాట జగనన్న చెబితే ఓ.. కే..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...