చత్తీస్‌గఢ్ లో మావోయిస్ట్ లు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు
15.నిమిషాలు ఇరువైపులా భీకరపోరు.మందు పాతర కిట్లు స్వాధీనం చేసుకున్న బాగాలు.
ఇటీవల మందు పాతరతో పోలీసులను మట్టుపెట్టిన మావోయిస్టులు.
మావోయిస్ట్ లపై ప్రతీకార చర్యకు పోలీసుల గాలింపు
పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం
చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్ పీ ఎఫ్, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఏఎఫ్ భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య సుమారు 15 నిమిషాలు భీకర పోరు జరిగింది.ఈ క్రమంలోనే మావోయిస్టులు మూడు ఐఈడీలు పేల్చి అక్కడి నుంచి పారిపోయారు.కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని గాలింపులు చేపట్టారు.ఈ క్రమంలో ఘటనా స్థలంలో మందుపాతర, ఆయుధాలు, వస్తు సామగ్రి, విప్లవ సాహిత్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.ప్రతీకార చర్యగా పోలీస్ బలగాల గాలింపు ఇటీవల చత్తీస్‌గఢ్ ప్రాంతంలో పోలీస్ లు ప్రయాణిస్తున్న వాహనం పై మావోయిస్టులు మందు పాతర పెల్చారు.
ఈ ఘటనలో పలువురు పోలీస్ లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులపై ప్రతీకార చర్య గా పోలీస్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఘాటియా ప్రాంతంలో పోలీస్ లు గాలిస్తుండగా మావోయిస్ట్ లు తార్సపడి కాల్పులు జరిపారు. తేరుకున్న పోలీస్ బలగాలు ఎదురు కాల్పులు చేపట్టడంతో మావోయిస్టులు పోలీసుల మధ్య 15నిమిషాలు భీకరమైన తుపాకుల యుద్ధం జరిగిందని సమాచారం. ఈ పోరులో ఇరువైపుల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మావోయిస్ట్ లు మాత్రం తప్పించుకు పోయారు. వారి కోసం పోలీస్ బలగాలు ముమ్మరంగా పాలిస్తున్నరు.ఏఓబిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి..
No comments:
Post a Comment