Followers

వలేటివారిపాలెం లో బంద్ విజయవంతం

 వలేటివారిపాలెం లో  బంద్ విజయవంతం

పెన్ పవర్,వలేటివారిపాలెం

మండల కేంద్రమైన వలేటివారిపాలెం లో  సిపిఎం, సిఐటియు,కెవిపిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. ఈ  బంద్ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు,బ్యాంకులు, విద్యా సంస్థలు మూత వేయించారు.బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాదాల రమణయ్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం 4 నెలల నుండి  పోరాటం చేస్తుంటే మోడీ ప్రభుత్వం,  చట్టాలను రద్దు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ను, లాభాలు గడించే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయటం సిగ్గుచేటని అన్నారు.  కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి రామాయపట్నం లో మేజర్ పోర్టు నిర్మించాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై  మోడీ ప్రభుత్వం మెడలు వంచడానికి భారత్ బంద్ చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి,  రైతు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు గుండ్ల తోటి మాధవ మూర్తి, సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు సాదు చెన్నకేశవులు,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పిల్లి రామ చంద్రరెడ్డి, ఎం మాధవ రావు, బాల నరసింహం, చీదర్ల మాలకొండయ్య,  దేవదారి  మాల్యాద్రి,  సిహెచ్ మాధవరావు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...