గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ చైతన్యం తెచ్చిందే... టీడీపీ
టీడీపీ రాష్ట్ర నేత కడారి ఐలయ్య
నెల్లికుదురు, పెన్ పవర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిందని ఆ పార్టీ దళిత విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య అన్నారు.టిడిపి ముప్పై తొమ్మిదవ ,ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం పార్టీ జెండానుఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు పంధొమ్మిది వందల ఎనబై మూడు సంవత్సరంలో టిడిపిని స్థాపించి ప్రజలకు సులభమైన పాలనను అందించాలని మండలాలను స్థాపించి రాజకీయ వికేంద్రీకరణకు పాల్పడ్డారన్నారు. పేదలకు రూ.రెండుకె కిలో బియ్యం అందించారని భూమిశిస్తు రద్దు చేశారని కరెంట్ బిల్లు పూర్తిగా తగ్గించారన్నారు.కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు బొల్లు ముత్తయ్య, బ్రహ్మం,భూక్యసోమన్న రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment