ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే క్రాంతి
తార్నాక,పెన్ పవర్
పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలలో భాగంగా జరుగుతున్న ప్రచారాన్ని అందోల్ ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలతో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల గురించి చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణిదేవి ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డివిజన్ లో ఓటర్లను ముందుగా గుర్తించి వారికి టిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి వివరించి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా సురభి వాణి దేవి గురించి ఓటర్లకు వివరించి, ఓటు వేయాలని విజ్ఞప్తి చేయవలసిందిగా సూచించారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కలిసి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణికి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, తెరాస గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, ముత్యం రెడ్డి, సుగుణాకర్, విట్టల్ యాదవ్, శ్రీలత, ప్రీతీ రెడ్డి, సువర్ణ, రాజబాబు, తుంగ తిరుపతి, కట్ట బుచ్చన్న, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment