నిరుద్యోగ భృతి కాదు ఉద్యోగాల భర్తీ కావాలి- ఓయూ జేఏసీ డిమాండ్
తార్నాక, పెన్ పవర్ఉద్యోగాల భర్తీ చేయకుండా ,నిరుద్యోగ భృతి ఇవ్వలేక ,ఇంకెందుకు ముఖ్యమంత్రిగా కొనసాగుతావు దిగిపోవాలంటూ ఓయూ విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ దేశంలో మాట మీద నిలబడని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ నిండు అసెంబ్లీ సాక్షిగా కరోనా ని సాకుగా చూపుతూ నిరుద్యోగ భృతి ఇప్పుడప్పుడే ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి అడగలేదని తాము కొట్లాడింది ఉద్యోగాల కోసమేనని, ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగాల భర్తీ చేయాలని విద్యార్ధి నేతలు డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి బోడ సునీల్ సీఎం మాటలకు కలత చెంది ఏడు సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు తమ ప్రాణాలు తీసుకోకముందే, తక్షణం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1లక్ష .91వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, ప్రతి ప్రభుత్వ యూనివర్సిటీలన్నింటినీ వీసీలను భర్తీ చేసి, హాస్టళ్లలో తెరిచి యూనివర్శిటీ విద్య కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు ఎల్చల దత్తాత్రేయ, హరీష్ గౌడ్, ధర్మపురి శంకర్, మహిపాల్ మహిపాల్ యాదవ్, వెంకట్ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment