విధులకు గై హాజరు అవుతే చర్యలు తప్పవు...
మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్
బేలా, పెన్ పవర్
మండలం లోని ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించే గైహాజరు అవుతే చట్టపరమైన చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం మండలంలోని ఆయా పాఠశాలను సందర్శించారు. మండలంలోని రాయపూర్ టీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలల్లో గైర్హాజరు కావడంతో పాఠశాలకు తాళం వేసి ఉండటంతో 2 రోజుల వేతనాన్ని నిలిపివేసినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థుల విద్యనందించే ఉపాధ్యాయులు పాఠశాలకు పోకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతారని అన్నారు. మారుమూల గిరిజన గ్రామాల నటువంటి ఆదివాసి విద్యార్థులకు విద్య అందకపోవడంతో వారి జీవితాలు ఏం కావాలని అన్నారు. పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయుల పై విద్యా హక్కు చట్టం తో సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment