జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి
మంచిర్యాల, పెన్ పవర్జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ పట్టణ కమిటీ నాయకులు గుర్లె ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికిస్తున్నటువంటి కరోనా ముగిసిందని అనుకుంటే మళ్ళీ జిల్లాలో విశ్వరూపం చూపిస్తుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో, హాస్టళ్లలో విద్యార్థులకు, సిబ్బందికి, ఉపాధ్యాయులకు కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా మళ్లీ విజృంభించక ముందే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలు సంక్షేమ గురుకుల హాస్టల్ లోని విద్యార్థులకు కరోనా రాపిడ్ టెస్టుల్లో చేయించాలని, కరోనా బారినపడ్డ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సిబ్బంది, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల, కళాశాల, హాస్టళ్లలో ప్రతిరోజు శానిటైజర్ చేయించాలని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో రోజుకు వేల సంఖ్యలో కరోనా వ్యాపిస్తుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, వైద్య, పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాకు వచ్చే ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా వచ్చినవాళ్లు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలని వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరుపున ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, బాపూరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment