కోదండ రామునికి లక్ష తులసి పూజ
పెన్ పవర్,కందుకూరు
పట్టణంలోని పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా కోదండ రామునికి మంగళవారం ఆలయ అర్చకస్వాములు రాజా స్వామి, పవన్ స్వాములు లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామ నామం జపిస్తూ స్వామివారికి తులసీ దళాలను అందజేశారు. మరి కొంత మంది మహిళా భక్తులు విష్ణు సహస్రనామం జరిపించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ లక్ష తులసి పూజ భక్తులకు కనువిందు చేసింది. పూజ అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది.సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment