ఇకనైనా ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించండి...
విశాఖ పొలిటికల్, పెన్ పవర్
గత కొంత కాలంగా ప్రభుత్వ విక్టోరియా జనరల్ హాస్పిటల్ ( ఘోష ఆసుపత్రి ) కాంటాక్ట్ వర్కర్లకు యాజమాన్యం జీతాలు సరిగా చెల్లించడం లేదు. ఉద్యోగులు జీత భత్యాలు లేక కుటుంబాన్ని పోషించు కొనుటకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టి కి తీసుకువెళ్లినా కంటి తుడుపు సమాదానాలే చెబుతున్నారు తప్పా జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయంపై వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు , ప్రభుత్వ ఉద్యోగుల మరియు కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ ఎర్రబిల్లి ప్రభాకర రావు సోమవారం మధ్యాహ్నం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. హేమలత తో సమావేశమై కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలపై కూలంకషంగా చర్చించి తక్షణమే వారికి జీతాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆమె ఒక వారం రోజులలో అందరికీ జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ కమిటీ మెంబర్లు కె.సత్యం , కృష్ణ , శంకర్, అప్పారావు , కె.రమణమ్మ , ఎస్. అరుణ, డి.వరలక్ష్మి, ఎ. రాధ, ఎస్.భారతి, లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment