యునైటెడ్ వే ఆప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం
కూకట్ పల్లి, పెన్ పవర్శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ లో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ కోచింగ్ సెంటర్ ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ లో పేద పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా తర్పిదు నివడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈశిక్షణ భవిష్యత్తులో వారికి వారి కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు ఇలాంటి ఉచిత కోర్సులు అందజేయడానికి ముందుకు వచ్చిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ శ్రీచందన (సేల్ ఫోర్స్), కిరణ్మయి పెండ్యాల బోర్డ్ మెంబర్, సీనియర్ మేనేజర్ భూషణ్, ప్రితిక మరియు సెంటర్ ఇంచార్జి కందూరు రాములుని ఆయన అభినందించారు. ఈసంస్థకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అతిథులకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బోయ కిషన్, జర్నలిస్ట్ కరీమ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డు మెంబర్ కాశీనాధ్ యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ శౌకత్ అలీ మున్న, గుడ్ల శ్రీనివాస్, కటిక రవి, యాదగిరి, మహేష్, దేవేందర్, భాస్కర్, సాయి గౌడ్, ప్రకాష్ మరియు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment