సమర్థులను ఎన్నుకోండి అభివృద్ధికి బాటలు వేయండి ఓటు వేసి గెలిపించండి
మీతోనే ఉంటాను బిజెపి జానసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి ఇంటింటా ప్రచారం
విశాఖ తూర్పు పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిని గా పోటీ చేస్తున్న ద్వారపు రెడ్డి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డ్ డి ఆర్ డి ఎ ఆఫీస్ పరిధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్కసారి అవకాశం ఇచ్చి తనకు గెలిపించినట్లయితే వార్డ్ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు నేను పుట్టిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని, ఒక అవకాశం ఇవ్వండి అని ముందుకు సాగారు చదువుకున్న వ్యక్తి, న్యాయవాది అయ్యి ఉండటం వల్ల సమస్యల మీద తనకు ఒక అవగాహన ఉందని, ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే నమ్మకంతో ప్రజలు ముందుకు వస్తున్నానని అన్నారు విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు భాగంగా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శ్యామ్ కుమార్., రామారావు మరియు బిజెపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment