భక్తులకు లఘు దర్శనము మాత్రమే కల్పించబడును
మహారాణి పేట, పెన్ పవర్శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోవిడ్-19 నిబంధనల పై ఆలయం తెరుచుటకు తీసుకొన్న చర్యలు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వములు . కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ,విజయవాడ వారు. కోవిడ్-19 పరిస్థితులకు అనుగుణంగా జూరీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ దిగువ తెలిపిని నిబంధనలకు లోబడి భక్తులకు లఘు దర్శనము మాత్రమే కల్పించబడును.1. శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులను పరిమితముగానే అనుమతించుట జరుగును, 2.60 సంవత్సరముల పై బడిన వయోవృద్ధులు, గర్భిణీ స్త్రీ లను, 10 సంవత్సరములలోపు వయస్సు కల వారిని దర్శనమునకు అనుమతించబడదు. 3.విధిగా మాస్కు ధరించిన వారిని మాత్రమే అనుమతించుట జరుగును.4. ప్రవేశ మార్గము వద్ద ఏర్పాటు చేయబడిన కోళాయి వద్ద కాళ్ళు కడుగుకొని సానిటైజేషన్ చేసిన తదుపరి మాత్రమే క్యూలైన్ లోనికి ప్రవేశించుటకు అనుమతించబడుదురు. 6. జ్వరం,జలుబు,దగ్గు ఉన్న భక్తులు అనుమతించబడరు.7. క్యూలైన్ లో నిర్దేశించిన మార్కులలో మాత్రమే సామాజిక దూరమును పాటించుచూ శ్రీ అమ్మవారి దర్శనమునకు వేచి ఉండవలెను. 8. అంతరాలయ ప్రవేశము కల్పించబడదు లఘు దర్శనము మాత్రమే కల్పించబడును. 9. ఆలయములోపల ఎటువంటి విగ్రహములను తాకరాదు. 10.దర్శనమునకు విచ్చేయు భక్తులు విధిగా ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ చూపించి, జిరాక్స్ కాపీని సమర్పించిన వారిని మాత్రమే అనుమతించబడును. 11. పైన తెల్పిన సూచనలు పాటించిన వారికి మాత్రమే దర్శనములు కల్పించబడును. 12. శ్రీ అమ్మవారికి భక్తుల నుండి ప్రసాదముల నివేదన, అన్న ప్రసాద వితరణ చేయబడదు మరియు ఇతరులకు పంపిణీ చేయుటకు అనుమతి లేదు. దేవస్థానం వారిచే ప్యాకెట్ల రూపంలో మాత్రమే అన్న ప్రసాద వితరణ జరుగును.12 సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీ మీ వాహనములను పార్కింగ్ ప్లేస్ నందు నిలుపుదల చేసుకొనవలెను.
No comments:
Post a Comment