Followers

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్వోలు

 సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్వోలు

గోకవరం,పెన్ పవర్   

గోకవరం మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం చిత్రపటానికి మండలంలోని విఆర్వోలు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల వీఆర్వో సంఘం అధ్యక్షుడు ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలకు డిడి ఓ ల్గా పదోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పంచాయతీ సిబ్బంది అనగా రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది మిగిలిన సచివాలయం సిబ్బంది అందరూ డిజిటల్ అసిస్టెంట్ తో సహా విలేజ్ రెవెన్యూ అధికారి అనగా డీడీ ఓలు ఆధీనంలో ఉంటారన్నారు. అదేవిధంగా గ్రామ వాలంటీర్లు కూడా డీ డీఓలు ఆదీనంలో ఉంటారన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు అయ్యే విధంగా వీఆర్వోలు (డీడీఓలు) సక్రమంగా పని చేస్తారన్నారు. వీఆర్వోలకు ఇటువంటి అదనపు బాధ్యతలు అప్పగించి పదోన్నతి కల్పించడం పట్ల సీఎం జగన్ కు ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ ఈరోజు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...