Followers

బిజెవైఎం ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్

 బిజెవైఎం ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్

 కూకట్ పల్లి, పెన్ పవర్ 

భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించారు.  భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్ ను ప్రకటించారు. ఈసందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బిజెవైఎం కార్యదర్శిగా తనను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రదీప్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని, మరింతగా కష్టపడి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అరుణ్ కుమార్ కు పలువురు నేతలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...