Followers

జెడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో మాక్ పార్లమెంట్

 జెడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో మాక్ పార్లమెంట్


చిన్నగూడూరు,పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలో మంగళవారం నాడు మాక్ పార్లమెంట్ జడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో నిర్వహించబడినది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏ రెహమాన్  మాట్లాడుతూ... 'పార్లమెంట్' దేశ పరిపాలనలో కీలకమైన  పాత్రను పోషిస్తుందని, సభా చట్టాలను ఆమోదంతో శాసనం చేస్తుందని అలాగే  విద్యార్థినీ విద్యార్థులు సభ నిర్వహణలో పాలుపంచుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా అలాగే ఆదర్శవంతమైన రాజకీయవేత్తలుగా భవిష్యత్ తరానికి పునాదిగా నిలబడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ భానోత్ అనిల్, ప్రధానమంత్రిగా కుమార్, వివిధ శాఖల మంత్రులు పూజ,ఉమా,కృష్ణజ, అరుణ్,వెంకటేష్ అలాగే ప్రతిపక్ష నేతలుగా గణేష్,ఉదయ్,స్రవంతి నరేంద్ర చారి మొదలగు పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా టి.తేజోన్నత రెడ్డి నోడల్ ప్రధానోపాధ్యాయులు జడ్.పి.హెచ్ఎస్ జయ్యారం మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు కె నాగేశ్వరరావు,కొలిపాక శ్రీనివాస్,జి.సతీష్ లు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో మిగతా ఉపాధ్యాయులు.వెంపటి విజయ్ రాజ్,సత్యం, సురేష్,రేణుకా దేవి,శ్రీనివాస్ రెడ్డి,కె.లలిత పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...