సమీకృత మార్కెట్ లను వెంటనే పూర్తి చెయ్యాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాదు , పెన్ పవర్పట్టణ ప్రగతి పనులు వేగం పెంచాలి. సమీకృత మార్కెట్ లను 6 నెలల్లో పూర్తి చేయాలి. మునిసిపాలిటీ లలో ప్రధాన జంక్షన్ ల అభివృద్ధి. సెంట్రల్ లైటింగ్,పచ్చదనం పై ప్రత్యేక దృష్టి. 15 రోజుల్లో ఒక్కో మునిసిపాలిటీ పై ప్రత్యేక సమీక్ష విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని 4 మునిసిపాలిటీ లలో ఇప్పటికే స్థలాలు గుర్తించటం జరిగిందన్నారు.మార్కెట్ కు వచ్చే కొనుగోలు దారులకు ప్రశాంత వాతావరణంలో అన్ని సరుకులు ఒకే దగ్గర కొనుగోలు చేసేలా ఉండాలన్నారు.ఇప్పటికే గజ్వేల్ లో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ లు,కమిషనర్ లు,ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు.అన్ని రకాల కూరగాయలు, ధాన్యం,పూలు,పండ్లు,వెజ్,నాన్ వెజ్ లాంటి అన్ని ఒకే దగ్గర లభించేలా ఈ మార్కెట్ లు ఉంటాయన్నారు.తినే పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా,ఒక స్వచ్చమైన స్థలం లో ఉంచటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు.పట్టణాల్లో నే ముందు 500 కోట్ల తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీ లలో సమీకృత మార్కెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి మునిసిపాలిటీ లో డంపింగ్ యార్డ్, వైకుంఠదామాల లను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.చెత్త తరలింపు ఆటో లు ఇప్పటికే అన్ని మునిసిపాలిటీ లలో అందుబాటులో కి వచ్చాయన్నారు. వికారాబాద్ మునిసిపాలిటీ లో ఎన్టిఆర్,బిజెఆర్ జంక్షన్ లను అభివృద్ధి పర్చాలని మంత్రి పేర్కొన్నారు. తాండూ
No comments:
Post a Comment