పేద వృద్ధులకు భోజనాలు సమకూర్చిన వృద్ధమిత్ర కో-ఆర్డినేటరు ఆదిత్య
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఎఎస్ఐగా పని చేస్తున్న ఎస్. నాగ ఆదిత్య ఐదుగురు నిరు పేదలైన వృద్ధులకు గురువారం నాడు భోజనాలు సమకూర్చారు. విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషనుల్లో ఎఎస్ఐగా పని చేస్తున్న నాగాదిత్య ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూనే మరోవైపు వృద్ధమిత్ర సమన్వయకర్తగా వృద్ధులు, పేదల అవసరాలను తీరుస్తూ, వారికి సేవలందిస్తున్నారు. ప్రతీ నెల తన జీతం నుండి కొంత మొత్తాన్ని, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగానే నాగ ఆదిత్య గంటస్థంబం వద్ద ట్రాఫిక్ విధులను నిర్వహిస్తున్న సమయంలో, గంటస్తంబం పరిసరాల్లో ఆకలిలో అలమటిస్తున్న ఐదుగురు వృద్ధులకు భోజనాలు సమకూర్చారు. జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చేస్తున్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిని పొంది, తనవంతు సహాయంగా తన పరిధిలో పేదలకు, వృద్ధులకు చేయూతను అందిస్తున్నట్లుగా నాగాదిత్య తెలిపారు.
No comments:
Post a Comment