Followers

జె.ఎన్.టి.యూలో హాస్టళ్లను తెరిచే ఉంచాలి

 జె.ఎన్.టి.యూలో హాస్టళ్లను తెరిచే ఉంచాలి


కూకట్ పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి జె.ఎన్.టి.యూ విశ్వవిద్యాలయంలో మూసివేసిన హాస్టళ్లను, మెస్ లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రధానద్వారాని మూసివేసి గేటుకు అడ్డంగా బైఠాయించి ప్రభుత్వానికి, విద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కరోనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు విద్యను అందని ద్రాక్షగా చేస్తోందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఓవైపు సినిమా హాళ్లు, మరోవైపు బార్లు, వైన్ షాపులను తెరిచి ఉంచిన ప్రభుత్వం కేవలం విద్యా సంస్థలను మాత్రమే మూసివేయడం వెనక కుట్ర దాగి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విద్యాసంస్థలను తెరిపించి ఎన్నికల్లో విజయం సాధించగానే విద్యాసంస్థలను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే తెరాస ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తునదని వారు మండిపడ్డారు. విందు వినోదాలు జరిగే అన్నింటిని తెరిచి పెడితే రాని కరోన కేవలం విద్యా సంస్థలు తెరిచిఉంటేనే వ్యాపిస్తుందా అని ప్రశ్నించారు. ఉన్నపళంగా హాస్టళ్లను మూసివేస్తే ఎక్కడెక్కడినుండో వచ్చిన తామంతా ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నత విద్యాసంస్థలను తెరిచే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన ద్వారం మూసివేయడంతో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ య్యింది. ఈకార్యక్రమంలో వివిధ సంఘాల విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...