భూర్కి గ్రామాన్ని సందర్శించిన రెడ్ క్రాస్ సొసైటీ బృందం సభ్యులు...
ఆదిలాబాద్ , పెన్ పవర్
ఆదిలాబాద్ మండలం భూర్కి గ్రామానికి గవర్నర్ ఆదేశాల మేరకు శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ బృందం పర్యటించరు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు తాగడానికి నీళ్లు ఊరి బయట ఉన్నటువంటి బావి నుంచి నీళ్లు తెచ్చుకొని తాగడంతో గర్భిణీలు, చిన్నపిల్లలు ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని రెడ్ క్రాస్ సొసైటీ బృందానికి గ్రామస్తులు తెలిపారు. గర్భిణీలు ఆస్పత్రికి వెళ్దాం అంటే రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బూర్కీ గ్రామ ప్రజలు ఆసుపత్రులకు వెళ్దాం అంటే సరిగ్గా రోడ్డు సౌకర్యం లేక గర్భవతులకు గానీ చిన్న పిల్లలకు జ్వరం వస్తే వెళ్దాం అంటే బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన రెడ్ క్రాస్ సొసైటీ బృందానికి తెలియజేయడం జరిగింది.వారికి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎస్. గంగేశ్వర్,తో పాటు స్టేట్ ఎంసి మెంబర్ విజయ్ బాబు,మేకల వెంకటస్వామి,అడ్వైజర్ అయ్యుబ్,బేలా మండల్ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, అప్పాల కిషన్ రావు,దినేష్ గౌడ్, వారి సమస్యలు తెలుసుకుని గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని వారికి రెడ్ క్రాస్ సొసైటీ బృందం భరోసా నిచ్చారు.
No comments:
Post a Comment