Followers

మహిళలు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలి

 మహిళలు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలి

విజయనగరం,పెన్ పవర్

మహిళా సాధికారత కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషిచేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి. ఈశ్వర్ కౌశిక్ అన్నారు. సోమవారం నాడు కొత్తపేట గొల్ల వీధి లో ప్రియదర్శిని రూరల్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో , కారుణ్య టైలరింగ్ సెంటర్ నిర్వహణలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని అన్నారు.

 మహిళలు ఆర్థికంగా స్థిరపడే విధంగా, మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, అన్ని పథకాలలో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుంది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం పట్ల  ప్రియదర్శిని అసోసియేషన్ చేస్తున్న కృషి  ఎంతైనా అభినందనీయమన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ వి వి రాజేష్, డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి, 13 వ డివిజన్ కార్పొరేటర్ ఈ సరపు రేవతీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఇందిరా తదితరులు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి, స్వయం ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు మహిళలకు శిక్షణ ఇస్తూ, ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చు శ్రీనివాసరావు, ఇస రపు రామకృష్ణ, లబ్ధిదారులు, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...