Followers

పేదల పక్షం తెలుగుదేశం

 పేదల పక్షం తెలుగుదేశం

పెన్ పవర్,ఆలమూరు 

 టీడీపీ పేదల పక్షంలో పనిచేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ  40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ పతకాన్నిఎమ్మెల్యేఆవిష్కరించారు. అనంతరం నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం నినాదంతో  బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచిన  మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్  అని  ఆయన స్థాపించిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వం  జ‌రుపుకోవ‌డం చాలాసంతోషంగా ఉందన్నారు.మహిళలకుఆస్తి హక్కు లో సగభాగం చట్టం కల్పించిన ఏకైక మహా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.పార్టీ ఆరంభించిన నెల‌ల కాలంలోనే అధికారంలోకొచ్చి  పేద‌ల‌కు కూడు, గూడు, గుడ్డ అందించే ప‌థ‌కాలు ఆరంభించారని కొనియాడారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల నుంచి యువ‌త‌రాన్ని రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేశారన్నారు.తెలుగుదేశం అనేదిఒక రాజ‌కీయ పార్టీగా కంటే, కోట్లాది మందితో కూడిన అతి పెద్ద ఉమ్మ‌డి తెలుగువారి కుటుంబంగా అంద‌రితో ఆత్మీయానుబంధం ముడిప‌డిందన్నారు.ప్ర‌తీ పేద‌వాడికి అండ‌గా నిలిచిన పార్టి గా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ  తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు  ఉంగరాల రాంబాబు, మాజీ  జిల్లా గ్రంధాలయ  సంస్థ ఛైర్మన్  నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, టి.డి.పి  కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...