Followers

వయోపరిమితి నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి : తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన

 వయోపరిమితి నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి : తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన

తార్నాక ,  పెన్ పవర్ 

తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో  వయోపరిమితి పెంపు, నిరుద్యోగుల భవిష్యత్ - విశ్వవిద్యాలయలపై ప్రభుత్వ వైఖరి అనే అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్ధి సంఘాల నేతలు మాట్లాడుతూ   యూనివర్సిటీలపై కక్ష సాధింపు చర్యలకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల గోడును పట్టించుకోవడం లేదని, 2 సంవత్సరాల నుండి యూనివర్సిటీలకు VC లు లేక విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులో యూనివర్సిటీలకు మొండిచేయి చూపించడం పై విద్యార్ధి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలకు కేంద్ర భిందువు అయిన మొదలైన యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేయడం  కక్ష సాధింపు చర్య  అని ప్రభుత్వన్నీ నిలదీశారు.   విధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఉద్యోగాలు వస్తాయని ఉద్యమం చేస్తే కేసీఆర్ విద్యార్థులను , నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని, ఇది ఇలాగే జరిగితే ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని తెలిపారు.  ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధి పిల్లి శ్రీకాంత్ , పాలమూరు యూనివర్సిటీ కొండకళ్ల విష్ణువర్ధన్, మహేందర్ గౌడ్,  శతవవన యూనివర్సిటీ కొళ రాము,  మహాత్మ గాంధీ యూనివర్సిటీ లింగం,  తెలుగు యూనివర్సిటీ రాంబాబు, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ,   మరియు టీఎన్వీఎస్  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పవన్,  దుర్గ, సాహిత్, ప్రతాప్, శివ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...