Followers

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

తార్నాక , పెన్ పవర్ 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంపై నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో వైజయంతి సినిమా వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శాంతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం హర్షణీయమని అన్నారు.. ప్రతి కష్టాన్ని తండ్రిలా పరిష్కరించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కార్పొరేటర్ శాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్,  రమణారెడ్డి, ముత్యంరెడ్డి, రామచందర్,  తుంగ తిరుపతి, శివ కుమార్,  హరి ప్రసాద్, భూపాల్ రెడ్డి, అంజి మాదిగ, వేణు, భాను, రఫీక్, తిరుమల్, సాయి ,శంకర్, సుగుణాకర్,  శంకర్ రెడ్డి,  చంద్రశేఖర్, సువర్ణ, ప్రీతి రెడ్డి, మహేష్, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...