ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విశాఖ అరిలోవ,పెన్ పవర్
విశాఖ మరియ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ వారి అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమములు ఘనంగా అరిలోవ సైంట్ అన్స్ కాన్వెంట్ లో జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అధితి గా టి ఇమాన్యుల్ రాజు సి ఐ ఆరిలోవ మరియు గౌరవ అధ్యక్షులు ప్రముఖ సీనియర్ న్యాయవాది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఐ.యం. అహ్మద్ ఈ కార్యక్రమమునకు హాజరు కావడం జరిగింది ఇమాన్యుల్ రాజు మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని వారిపై తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలని అన్నారు తక్కువ వయసు కలిగిన అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల చేతులలో మోసపోతున్నరని అటువంటివారిని ఈ సంఘాల ద్వారా కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో పెట్టాలని అని అన్నారు అలాగే న్యాయవాది స్టేట్ అధ్యక్షులు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా. ఐ యం. అహ్మద్ మాట్లాడుతూ నేను ఈ సంస్థకు పది సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను అని అన్నారు ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నది.
సెయింట్ ఆన్స్ సిస్టర్ మరియు సిస్టర్ ఫిలో అగస్టిన్ 1992 వ సంవత్సరంలో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది ఐదుగురు సభ్యులతో ప్రారంభించి ఐదు వేల మంది సభ్యులు 270 సంఘాలుగా ఏర్పడి అనేక సేవ కార్యక్రమాలు, ఆర్థిక ఆరోగ్య విద్య సామాజిక రంగాల్లో ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు వీధిలైట్లు రోడ్లు శానిటేషన్ వంటివి కుటుంబ కలహాలకు పోలీస్ స్టేషన్ కు కోర్టుకు వెళ్లకుండా కౌన్సెలింగ్ ద్వారా కుటుంబాలను తిరిగి కలపటం జరుగుతుంది అని అన్నారు అనంతరం ప్రత్యాస బృందం ఆవిష్కరణ మహోత్సవం బ్యానర్ మరియు బ్రోచర్ ను విడుదల చేయటం జరిగింది ఈ కార్యక్రమమునకు ,అడ్వకేట్ సజిత, డైరెక్టర్ ఎంజిల్ మేరీ, సిస్టర్ శాంతి, మరియు, 10 వ వార్డ్ కార్పొరేటర్, యం.రామలక్ష్మి, 12 వ వార్డ్ కార్పొరేటర్ అక్రమాని రోహిణి, 13 వ వార్డ్ కార్పొరేటర్ కెల్ల సునీత పాల్గొనటం జరిగింది.
No comments:
Post a Comment