ఎస్సీ కార్పొరేషన్ లబ్దిదారులకు వాయిదా.. మున్సిపల్ కమీషనర్
పెన్ పవర్, మరిపెడమహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సమావేశం వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ రుణ సహాయానికి 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి 110 మంది లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జరగవలసిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనివార్య కారణాల వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని ఆయన లబ్ధిదారులు కు వివరించారు.
No comments:
Post a Comment