కేంద్రీయ విద్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
పెన్ పవర్, కందుకూరు
పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ ఎంసి ఛైర్మన్ శిరీష మాట్లాడుతూ నేటి సమాజం లో స్త్రీలు పురుషుల తో సమానం గా గౌరవింపబడటం చాలా ఆనందం గా ఉందన్నారు. భావిభారత పౌరులును జాతికి అందించడం లో స్త్రీ తను మొదటి గురువుగా, డాక్టర్ గా , సేవకురాలుగా పురిటి బిడ్డ ఎదుగదలకు నిరంతరం కృషి చేసి జాతికి పౌరులను అందించడం జరుగుతుందన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, స్త్రీ చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా , మన ఇంటిని తీర్చిదిద్దడం కోసం ఉపయోగిస్తే ఆ సమాజం బాగుపడుతుంది అని అన్నారు. తదుపరి విద్యార్థుల తల్లులకు ఆటలపోటిలు నిర్వహించడం జరిగింది. మాచవరం సర్పంచ్ పోట్లూరి లలిత అందరికీ మహిళా దినోత్సవం శుభకాంక్షలు తెలియచేయడం జరిగింది. 15 మంది మహిళలను కేంద్రీయ విద్యాలయం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు , పిటీ ఏ సెక్రెటరీ ఎ వి రావు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment