Followers

బాల్యవివాహాల నిర్మూలన కై కళా కారుల కళా జాత ప్రదర్శన

 బాల్యవివాహాల నిర్మూలన కై కళా కారుల కళా జాత ప్రదర్శన

తాండూర్, పెన్ పవర్

తాండూర్ కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా,శిశు సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రాజెక్ట్ పరిధి లో బాల్య వివాహాలపై కార్యక్రమన్ని  నిర్వహించారు. రేచిని  గ్రామ పంచాయతీలలో ప్రజలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కళాజాత ద్వారా ఆడపిల్లలకు జరుగుతున్న అసమానతలపైన, బాల్య వివాహాలు 18 సంవత్సరాలు  నిండని ఆడపిల్లకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని, వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి సత్తయ్య, సర్పంచ్ దుర్గుబాయి, ఎస్ఐ శేకర్ రెడ్డి ఎంపిటిసి మొగిలి శంకర్ నాయకులు దత్తుమూర్తి, కార్యదర్శి పోచంపల్లి వసంత, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...