Followers

జాయిన్ హాండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం బడి

 జాయిన్ హాండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం బడి

మందమర్రి,పెన్ పవర్

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువుతో మానసిక  వికాసంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని జాయిన్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సంజయ్ కుమార్ అన్నారు. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో మధ్యాహ్నం బడిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అందరికీ చదువు అందించాలని, సొంతంగా రాయడం చదవడం నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సంతకం పెట్టడానికి మరొకరి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదని అందుకోసమే వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అందరికీ అందించాలని, మధ్యాహ్నం బడిని రామకృష్ణ పూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో సుమారు 50 మందికి ఉచిత విద్య కార్యక్రమన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి తాము అండగా ఉంటామని ఎక్కడ ఎవరికి బాధ కలిగిన వారికి తమ వంతు సాయం చేస్తూ, మంచి మనసుతో ఆదరించి వారికి అన్ని విధాలా తోడుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయవాది మల్లయ్య, తిరుపతి, ఉపాధ్యాయురాలు స్రవంతి, భాగ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...