రాజకీయ సన్యాసుల మాటలు నమ్మొద్దు..
విజయనగరం,పెన్ పవర్విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 30వ డివిజన్ (ధర్మపురి) లో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మరియు విజయనగరం నియోజకవర్గ ఇంచార్జి అదితి గజపతి రాజు గారు పాల్గొన్నారు.
శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతూ :
నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో, జిల్లాలో ప్రతి ఇంటికి, ప్రతి సెంటుకు నీరు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. జిల్లాలో జంఝావతి, తోటపల్లి మొదలగు నదుల కాలువలు అభివృద్ధి చేసి త్రాగు నీరు, సాగు నీరు అందించాం.అదేవిధంగా అప్పలకొండయంబ గారు త్రాగునీరు ప్రాజెక్ట్ ప్రారంభించి విజయనగరం పరిసర ప్రాంతాల ప్రజలకు నీరు అందించారు.అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పూర్తి స్థాయిలో అమలు చేసింది టీడీపీ ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ మరియు చంద్రబాబు.ఇదివరకు కొంతమంది ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని అన్నారు, కానీ తీసుకోలేదు, అలాంటి రాజకీయ సన్యాసుల మాటలు నమ్మొద్దు,ఈ ఓటు తో వారు శాశ్వతంగా రాజకీయా సన్యాసులుగా మార్చే అవకాశం మీకు ఉంది. ఇప్పుడు పిట్టకథలు చెప్పుకుంటూ వస్తున్న నేతల మాటలను నమ్మకండి, నమ్మితే మన జీవితాలు ఓ పిట్టకధగా మారిపోతాయి.బెదిరించే వారికి భయపడకండి, ఒకవేళ భయపడితే 5 ఏళ్ళు వారికి భపడాల్సి వస్తుంది. రానున్న ఎన్నికకాలలో టీడీపీ మేయర్ అభ్యర్థి శమంతకమణి గారిని గెలిపించాలి, అలాగే మీ డివిజన్ టీడీపీ అభ్యర్థి గేదెల ఆదిబాబు గారిని గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను నియంత్రించలేని స్థితిలో వైకాపా పాలకులు ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే టీడీపీ గెలుపునకు సోపానాలన్నారు. పోలీసు, అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పధకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎవరి సొమ్ముతో పధకాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. వైకాపా పాలనలో ఇసుక, సిమ్మెంట్, గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందన్నారు. పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment