కూనా శ్రీశైలంగౌడ్ ను కలిసిన సుభాష్ నగర్ బీజేపి మాజీ అధ్యక్షుడు హనుమాన్..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన నాటినుండి..బాజాపా నాయకులు కార్యకర్తలు శ్రీశైలంగౌడ్ ఇంటికి క్యూ కట్టారు..బాజాపాలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.. కుత్బుల్లాపూర్ గాజులరామారం లోని కూన సౌజన్య గార్డెన్స్‌లో బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను సుభాష్ నగర్ 130 డివిజన బాజాపా మాజీ అధ్యక్షుడు హనుమాన్ కచ్చావ నేతృత్వంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలియజేశారు.. హనుమాన్ మాట్లాడుతూ శ్రీశైలంగౌడ్ బీజేపీలో చేరి మంచి నిర్ణయం తీసుకున్నారని సుభాష్ నగర్ డివిజన్ నుండి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హనుమాన్ తెలిపారు.., అలాగే పలు నియోజకవర్గాల బిజెపి నాయకులు కుత్బుల్లాపూర్ కి చెందిన పలువురు నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోవు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ రామచంద్ర రావును గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని మనమంతా కలిసి రామచంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు..
No comments:
Post a Comment