Followers

రంగుల పండుగకు ఆంక్షలు..గీతదాటితే వేటే

 రంగుల పండుగకు ఆంక్షలు..గీతదాటితే వేటే..

కుటుంబ సభ్యులతోనే హోళీ ఉత్సవాలు

హోళి వేడుకలకు అనుమతులు లేవు.. డిసిపి మాదాపూర్..

కరోన విజృంభణ నేపధ్యంలో కఠిన నిర్ణయాలు..

ఈవెంట్స్ ఆర్గనైజర్లకు,హాస్టళ్ల నిర్వహకులకు హెచ్చరికలు..

పంక్షన్ హాల్స్,గ్రౌండ్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, క్లబ్ హౌస్ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు..

కూకట్ పల్లి, పెన్ పవర్ 

కరోన విలయతాండవం చేస్తున్న వేళ్ళ హోళీ వేడుకలకు దూరంగా ఉండాలని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి హోళీ వేడుకలకు పర్మిషన్లు ఇవ్వలేదని, పంక్షన్ హాల్స్, గ్రౌండ్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, క్లబ్ హౌస్ లపై ప్రత్యక నిఘా టీమ్ లను ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు విజృంభిస్తుండడంతో ఆంక్షలు అమలు చేస్తున్నామని, ఎవరి ఇంట్లో వారే పండగ చేసుకోవాలి కానీ ఎక్కువ మంది ఒకే దగ్గర చేరి రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం లాంటివి చేయడంతో వైరస్ ఒకరినుండి ఒక్కరికి సులభంగా చేరి కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించాలన్నారు. అపరిచిత వ్యక్తులపై రంగులు చల్లడం, డీజేలు, స్పీకర్లు లాంటివి పెట్టి డ్యాన్సులు చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపరదని, ప్రశాంత వాతావరణంలో కేవలం కుటుంబ సభ్యులతో కలిసి జాగ్రత్తలు పాటిస్తూ పండగ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టళ్ల నిర్వహకులకు హెచ్చరికలు జారి చేసామని, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్ లు, బౌతిక దూరం పాటించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా పరిమితికి మించి హోళీ పండుగలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...