ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం
పెన్ పవర్, కందుకూరు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఓ ఈ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 108 ఓ ఈ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధునాతన 108 వాహనాలను అత్యాధునిక పరికరాలతో సాంకేతిక పరిజ్ఞానం జోడించి పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో 15,20 నిమిషాలలో రెస్పాన్స్ టైమ్ లో అంబులెన్స్ లు చేరేలా ఎ ఎల్ యస్, బి ఎల్ యస్ తో పాటు నియోనాటాల్ తో కలిపి కందుకూరు డివిజన్ లో మండలానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 12 అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించేందుకు నియోనాటల్ సేవలు అందించేందుకు మన ప్రకాశం జిల్లా లో రెండు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారని తెలిపారు. అందులో ఒక నియోనాటల్ మన కందుకూరు డివిజన్ లోని నవజాత శిశువులను కాన్పు ఐన రోజు నుండి నెల వరకు పిల్లల సంరక్షణ కోసం దేశంలోనే అత్యధునాతన పరికరాలు ఐన ఇంక్యూబేటర్ ,వెంటిలేటర్,సిరంజి పంప్ ,ఇన్ఫయూషన్ పంప్ వంటి దాదాపు 50 రకాల పరికరాలతో కందుకూరు ఏరియా హాస్పిటల్ నందు అందుబాటులో ఉందని అన్నారు.
ఈ అంబులెన్స్ లు పేషెంట్ ను హాస్పిటల్ కి చేరవేసే మార్గమధ్యలో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి అంచనా వేసి అధునాతన పరికరాలతో జాగ్రత్తలు తీసుకుంటు పేషెంట్ కోరిన ప్రైవేట్ హాస్పిటల్ కి సైతం తీసుకువెళ్తుందని అన్నారు .గర్భిణి స్త్రీలు పరీక్షల కోసం హాస్పిటల్ కి వెళ్లే సందర్భంలో , డయాలసిస్ కోసం ,బ్లడ్ ట్రాన్సఫుషన్ , కీమోథెరఫీ కి హాస్పిటల్ కి వెళ్లే సందర్భంలో 108 సేవలు అందించేందుకు సేవలు వినియోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం రామలక్ష్మి, కందుకూరు ఏరియా ఆస్పత్రికి నందు గల ఎ ఎల్ యస్, నియోనాటల్ అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment