Followers

వి కె ఎస్ పి చెక్ ను అందించిన వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ ప్రకాశరావు

వి కె ఎస్ పి చెక్ ను అందించిన వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ ప్రకాశరావు

పెన్ పవర్,కొవ్వూరు

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వాసవి క్లబ్ కపుల్స్  ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కుటుంబ సురక్ష పథకంలో భాగంగా కొద్దిరోజుల క్రితం మరణించిన వి కే ఎస్ పి సభ్యుడు అయినటువంటి  కీ.శే. బొమ్మ వెంకట శివరామకృష్ణ  వారి కుటుంబానికి  వి కే ఎస్ పి పధకం ద్వారా వచ్చిన5 లక్షల 8200 ల రూపాయల చెక్ ను జిల్లా గవర్నర్ బోనగిరి ప్రకాశరావు,  ఇంటర్నేషనల్ సభ్యులు  మహంకాళి మురళి, వి కే ఎస్ పి చైర్మన్ ఊటుకూరి కిరణ్ కుమార్ ,రీజనల్ చైర్మన్ అప్పన చంద్రధరగుప్త, క్లబ్ ప్రెసిడెంట్ కొత్త రామ,జోన్ చైర్మన్  గీతదేవి చేతులమీదుగా శివరామకృష్ణ కుమారునికిఅందచేయడం జరిగినది. జిల్లా గవర్నర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ వి కె ఎస్ పి పధకం లో చేరిన ప్రతి సభ్యునికి ఈ పథకం అండగా ఉంటుందని ఇటువంటి పధకం ఏ సంస్థ లోనూ లేదని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ, కోసాధికారి, మాజీ అధ్యక్షులు, జిల్లా సభ్యులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...