Followers

జె.ఏ.పి.ఈ.ఈ,పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలి...బి.జె.పి

 జె.ఏ.పి.ఈ.ఈ,పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలి...బి.జె.పి

విశాఖ తూర్పు, పెన్ పవర్

మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం జె.ఏ.పి.ఈ.ఈ,పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలని, పేదలకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగో పాలసీగా ఇసుకను అమ్మేందుకు జె.ఏ.పి.ఈ.ఈ,పవర్‌ కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టడం సరికాదని, నాలుగో పాలసీని తెచ్చిందంటే ఈ 20 నెలల్లో అమలుచేసిన 3 ఇసుక పాలసీలు విఫలమైనట్లు భావిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. టన్నుకు రూ.370 లకు అమ్ముతున్న ఇసుకను, రూ.470 లకు పెంచి అమ్మేలా  జె.ఏ.పి.ఈ.ఈ పవర్‌కు ఎందుకు కట్టబెట్టారో వివరణ ఇవ్వాలని, రూ.370 ప్రభుత్వానికి మరియు రూ.100 కాంట్రాక్టరుకు ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఇదొక్కటేనని, టెండర్‌ ఖరారుచేసిన కంపెనీలో వైకాపాకు చెందిన ఎంపీలే భాగస్వాములగా ఉన్నారని కంపెనీ రికార్డులే చెబుతున్నాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.విజయానంద రెడ్డి,సాగి కాశీవిశ్వనాథ రాజు, కొప్పిశెట్టి శంకర రావు,మంజుల  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...