Followers

దారి సమస్యను పట్టించుకోని స్థానిక అధికారులు

దారి సమస్యను పట్టించుకోని స్థానిక అధికారులు

గత నెల రోజులుగా స్థానికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత

సబ్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు

డ్రెయినేజీ, మంచినీటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్దానికులు, ప్రజా సంఘాల డిమాండ్

కోరుకొండ, పెన్ పవర్ 

మండలంలోని గాడాల గ్రామం , 425/1A సర్వే నెంబర్ లోని వివాదాస్పదంగా మారిన దారి సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానికుల మధ్య నిత్యం ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. గత కొంతకాలంగా ఈ సమస్యపై డి.ఎల్.పి.ఓ, ఎంపీడీవో,ఎమ్మార్వో,వీఆర్వో,పంచాయతీ కార్యదర్శులకు సమస్య వివరించినా వారు పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. స్థానిక గొంతేల్లమ్మ గుడి వీధి  పూర్తిగా ఆక్రమణలకు,భూకబ్జాలకు పాల్పడడంతో ఈ దారి గత కొన్నేళ్లుగా మూతపడిందని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామ కంఠం ముఖ్యంగా దారి సమస్య ఎదుర్కొంటున్న గొంతేలమ్మ గుడి సమీపంలో సర్వే జరిపించాలని, డ్రైనేజీ, దారి మార్గం ఏర్పాటు చేయాలని, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థను కల్పించాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై స్పందించిన ఆమె  కోరుకొండ ఎమ్మార్వో,ఎం పీ డీ వో లకు సమస్య పరిష్కరించాలని ఆదేశించిన, ఆ ఆదేశాలను మండల అధికారులు  పట్టించు కోవడంలేదని బాధితులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమస్య పెండింగ్లో ఉండడం వల్ల స్థానికులకు,బాధితులకు,భూ కబ్జాదారులకు మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతూ, శాంతి భద్రతల సమస్య  దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్వే జరిపించి స్థానికులకు దారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థను కల్పించాలని, శాంతిభద్రతలను కాపాడాలని స్థానికులు , ప్రజా సంఘాల డిమాండ్ విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...