Followers

పోషక పదార్దాలు పిల్లలకు శ్రేష్ఠకరం

పోషకపదార్దాలుపిల్లలకు శ్రేష్ఠకరం

 సర్పంచ్ లు బొల్లెపెల్లి శ్రీనివాస్ గౌడ్, జ్యోతి శ్రీనివాస్ గౌడ్, బానోత్ బుజ్జమ్మ.



నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లానెల్లికుదురు మండలం లోని వావిలాల, శ్రీరామగిరి, కాస్యతండా గ్రామాలలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గర్భిణీలకు పిల్లలకు సరైన పోషకాహారమే శ్రేష్ఠమైనదని  పుట్టినప్పటినుంచి ఆరు నెలల వరకు   శిశువు లకు తల్లిపాలనే   విధిగా  ఇవ్వాలని  వావిలాల సర్పంచ్ బొల్లేపల్లి శ్రీనివాస్ గౌడ్ శ్రీరామగిరి సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కాశ్యతండా సర్పంచ్ బానోత్ బుజ్జమ్మ వెంకన్న నాయక్ అన్నారు. శుక్రవారం వావిలాల శ్రీరామగిరి,కాస్య తండా గ్రామపంచాయతీ లో  పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పోషక పదార్థాలతో కూడిన ఆహారం ఉంటుందని బిడ్డ మంచిగా ఎదగటానికి పోషక విలువలతో కూడిన ఆహారం దోహదపడుతుందని, మూడు సంవత్సరాలు నిండిన చిన్న పిల్లలను  ఆటపాటలతో అంగన్ వాడి కేంద్రాలకు  మొదటగా  అలవాటు చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో  సూపర్వైజర్ ఎస్కె గౌసియా, వావిలాల అంగన్వాడి సెంటర్ రెండు  టీచర్ బొల్లెపల్లి రాజ్యలక్ష్మి,శ్రీరామగిరి అంగన్వాడీ టీచర్లు మద్దెల కనకతార, గాజుల ఇందిరా, సుజానా,కాశ్యతండా అంగన్వాడీ టీచర్లు సుజాత బానోతు పద్మ,మాలోత్ వరాలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...