ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని..కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం,పెన్ పవర్ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. శుక్రవారం 7వ వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటించారు. స్థానిక వార్డు సభ్యులు పొంతపల్లి మాలతి, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి దాసన్నపేట లోని యాత వీధిలో ఆయన పర్యటించారు. ఆ ప్రాంతంలో ప్రధాన సమస్య గా ఉన్న పైప్ లైన్లు, రహదారుల సమస్యపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య పై స్థానికులు విన్నవించారు. వాటి పరిష్కారానికి వేనువెంటనే కోలగట్ల సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ద్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల అనంతరం కూడా వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. సమస్యలను స్థానిక నాయకులకు, వార్డు సభ్యులకు వివరించి అవి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని స్థానికులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తమ అభిమతమని అన్నారు. దాసన్నపేట లో ఎంతోకాలంగా నీటి ఎద్దడి ఉండేదని తమ హయాంలో వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రజల నీటి కష్టాలు తీర్చామన్నారు. వేసవిలో కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏడవ వార్డు సభ్యురాలు మాలతీ మాట్లాడుతూ తనను కార్పొరేటర్ గా ఎన్నుకున్న ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి నేతృత్వంలో వార్డులలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేరుగా తమ వద్దకు వచ్చి విన్నవించుకోవచ్చని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సంఘంరెడ్డి బంగారు నాయుడు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కోరాడ సూర్య ప్రభావతి,బోడసింగి ఈశ్వరరావు, పొంతపల్లి గోపి, నగరపాలక సంస్థ డిఈ అప్పారావు,పారిశుద్ధ్య పర్యవేక్షకులు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment