Followers

విశాఖ లో రౌండ్ టేబుల్ సమావేశం

 విశాఖ లో రౌండ్ టేబుల్ సమావేశం

ఏక్షన్ ఎయిడ్ ( ఇంటర్నేషనల్ ఎన్.జి.ఓ.) స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో

విశాఖ పొలిటికల్,పెన్ పవర్ 

 విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ నందు గురువారం ఏక్షన్ ఎయిడ్ ( ఇంటర్నేషనల్ ఎన్. జి.ఓ )  రాష్ట్ర స్థాయి సంప్రదింపులు స్వచ్చంద సంస్థ అద్వర్యం లో ఏక్షన్ ఎయిడ్ అసోసియేషన్  ప్రొగ్రాం ఆఫీసర్ ఇర్ఫాన్ ,  ఆంధ్ర ప్రదేశ్ అసోసియేషన్ కన్సల్టెంట్  డి.ఇందు నిర్వహణలో వేతన కోడ్ నియమాలు , సామాజిక భద్రతా నియమాల కరపత్రం లోని విషయాలపై  మరియు మహిళా కార్మికుల యొక్క గౌరవ మర్యాదలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు పనిచేస్తున్న చోట వారు ఎలాంటి హింస కు , వేధింపులకు గురి కాకూడదు అనే నినాదం పై , మరియు వారికి ఎలాంటి సదుపాయాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఏక్షన్ ఎయిడ్ సంస్థ వారు 4 ముఖ్య మైన లేబర్ కోడ్స్ ను తయారు చేశారు. అలాగే సుప్రీం కోర్టు పేర్కొనినట్టు ప్రభుత్వం పై ఆధారపడకుండా తమ కుటుంబాలను పోషించుకోవడాని వీధులలో బండ్లు పై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు వాళ్ళు అమ్ముకోవడానికి వీలుగా ఒక స్థలాన్ని కేటాయించి ఆయా స్థలాలలో పెర్మనెంట్ గా వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసుకొని జీవనాన్ని సాగించుటకు వీలుగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఇటువంటి కొన్ని అంశాలపై చర్చించడానికి వారి యొక్క సహాలను, సూచనలను అందించడానికి ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా  4 వ జోనల్ కమీషనర్  కె. సింహాచలం , అతిదిగా సౌత్ చిరి వ్యాపారుల యూనియన్ వై.ఎస్.ఆర్. టి.యు.సి. అధ్యక్షుడు ఎర్రబిల్లి ప్రభాకర రావు , రాష్ట్ర స్థాయి అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు, మహిళ ఏక్షన్ సెక్రటరీ స్వర్ణ కుమారి , ఇతర ఎన్.జి.ఓ లు , ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ సోషల్ వర్కర్ ఎ. బి.ఎస్.వి. రంగారావు , జర్నలిస్ట్ లు టైమ్స్  ఆఫ్ ఇండిస్  యుగంధర్ , ద హన్స్  సులోచన లు , న్యాయవాదులు హాజరైనారు.

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...