Followers

ఏరియా ఎస్టీ వెల్ఫేర్ నూతన కార్యవర్గం ఎన్నిక

 ఏరియా ఎస్టీ వెల్ఫేర్ నూతన కార్యవర్గం ఎన్నిక





మందమర్రి,  పెన్ పవర్ 

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ఏరియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు బానోతు కర్ణ, ఉపాధ్యక్షులు తేజావత్ హీరియా, నాయకులు వి శివ, ఏరియా లైజన్ అధికారి మధుసూదన్ హాజరయ్యారు. మందమర్రి ఏరియా అధ్యక్షునిగా బుక్యా సుమన్, ప్రధాన కార్యదర్శిగా ఆమ్గోత్ రవికుమార్, ముఖ్య సలహాదారునిగా వి బిక్షమయ్య, సలహాదారులుగా కే తారాచంద్, గౌరవ అధ్యక్షులుగా బుక్యా రాంబాబు, బుక్యా దేశాయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బానోతు తిరుపతి, ఉపాధ్యక్షులుగా బుక్యా రాములు, పాయం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా బానోతు నాగేశ్వరరావు, కే సాయి తేజ, జాయింట్ కార్యదర్శులుగా మాలోతు బాలు, బుక్యా హరి నాయక్, జే కిట్టు, ఆర్ జీవన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఐ నరేంద్ర కుమార్, ఎల్ బాలాజీ, కె హనుమంతు, బి రాజేందర్, కోశాధికారిగా జి బాలాజీ, జాయింట్ కోశాధికారి జే శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శులుగా బి వీరు, జే రామదాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...