ఆడబిడ్డకు అండగా నిలుద్దాం...
భేటీ బచావో - భేటీ పడావో
గుడిహత్నూర్, పెన్ పవర్అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా జీవిస్తారని ఆడపిల్లను కాపాడు - ఆడపిల్లను చదివించు కార్యక్రమం అద్భుతమని గుడిహత్నూర్ ఉప సర్పంచ్ మటపతి గజానంద్ అన్నారు.స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో స్త్రీ , శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆడపిల్లలను కాపాడండి - ఆడపిల్లలను చదివించండి అనే అంశంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి సదస్సు నిర్వహించామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు పద్మ, శిరీన్ లు తెలిపారు. భేటీ బచావో , భేటీ పడావోపై అవగాహన కల్పిస్తూ ఆడపిల్లల సంరక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంకతి రవీందర్, కారొబారి అమీన్,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment