కుచలాపూర్ లో నైబర్హుడ్ పార్లమెంట్ కార్యక్రమం
తలమడుగు , పెన్ పవర్తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో రైతు వేదికలో నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ అఖిల్ , మండల వాలెంటరీ రాము ఆధ్వర్యంలో నైబర్హుడ్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీపీ కల్యాణం లక్ష్మీరాజేశ్వర్ స్థానిక సర్పంచ్ మోహితే ప్రభ దేవ్రావ్,మోటివేటర్ స్పీకర్ పురుషోత్తం రెడ్డి,స్థానిక ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రతాని నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ అఖిల్ మాట్లాడుతూ,దేశ భవిత యువకులు చేతుల్లోనే ఉందని, ప్రతి యువకుడు చదువుతో పాటు వివిధ రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని నలుగురికీ ఆదర్శంగా,జీవనాన్ని కొనసాగించాలని,ముఖ్యంగా ప్రోడక్టివిటీలో ముందుండాలని ప్రతి యువకుడు చిన్నాపెద్దా పని అని చూడకుండా దేశాభివృద్ధిలో పాటుపడాలని పేర్కొన్నారు. అలాగే వివిధ గిరిజన గ్రామాల యువకులు హాజరై గిరిజన గ్రామాల్లో వనరులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.
No comments:
Post a Comment