Followers

ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా...

ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా..



24వ వార్డు వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్ 

నర్సీపట్నం, పెన్ పవర్ 

24 వ వార్డు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఏక శివ ప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ పరిమితమైన అనుచరగణంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలో ఉన్నా,  లేకపోయినా తమ కష్ట సుఖాలలో అందుబాటులో ఉండే శివప్రసాద్ ను వార్డు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. వార్డు అభివృద్ధి కోసం శివప్రసాద్ ను గెలిపించుకుంటామని వార్డు పెద్దలు, యువకులు మద్దతు  ఇస్తున్నారు. విద్యావేత్త, వార్డు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు అవసరం ఎంతైనా ఉందని శివప్రసాద్ ను  ఆశీర్వదిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డు మొత్తం ఎల్ఈడీ లైట్లు వేయిస్తానని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూస్తానని, ఇంటింటికి కొళాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని, మున్సిపాలిటీలోనే 24వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో సిమెంట్ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల నుండి సహకారం లభిస్తుండటంతో శివప్రసాద్ ప్రచారంలో జోష్ పెరిగింది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...