ధరలను అదుపు చేయలేని ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి...ఏ.ఐ.టి.యూ.సి,డిమాండ్
భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఈనాడు జంక్షన్ వద్ద ఏ.పి, ఆటో అండ్ మోటర్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యూ.సిఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. వామనమూర్తి మాట్లాడుతూ బి.జె.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను,రైల్వే ఛార్జీలను భారీగా పెంచి ప్రజల మీద లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారాలు వేశారని మండిపడ్డారు.
ధరలను అదుపు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న జరుగు భారత్ బందును జయప్రదం చేయాలని కార్మికవర్గం, ప్రజానీకాన్ని కోరారు.ఈ ధర్నాలో ఏస్.ఎర్రయ్య,వే.లక్ష్మణ్ రావు,రావి వాసు పి.శ్రీను,పి.దాల్ నాయుడు,కె.అప్పలరాజు,రావికృష్ణ, ఎమ్. పైడ్రాజు లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment