Followers

మానేరు లోకి కదలి వచ్చిన గోదావరి జలాలు

 మానేరు లోకి కదలి వచ్చిన  గోదావరి జలాలు 

గంభీరావుపేట,  పెన్ పవర్ 

 గంభీరావుపేట మండలం  నర్మాల ఎగువ మానేరు లోకి గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్యాకేజి  11,12 మల్లన్న సాగర్ కొండ పోచమ్మ ప్రాజెక్టు నీళ్లను  గత వారం రోజులు గా కూడ వెళ్లి వాగు లోకి దాదాపు  36 చెక్ డ్యామ్ లు  నింపు కుంటూ, సోమవారం  ఎగువ మానేరు ఒడిలో కి చేరిన గోదావరి నీళ్లు భారీగా తరలి వచ్చిన మూడు మండలాల రైతులు గంభీరావుపేట  మండలం, ముస్తాబాద్, ఎల్లారెడ్డి పేట, రైతులు నాయకులు మాట్లాడుతూ  ముందుగా కేసీఆర్ కు  పాదాభివందనాలు చేస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు దృడ సంకల్పము మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు నెల రోజులు భారీ నుండి అతి భారీగా వర్షాలు పడితే తప్ప కూడవెళ్లి వాగులో నీళ్లు కాని పించే పరిస్థితి ఉండదు.  అలాంటిది వందల కిలో మీటర్ల పొడవు నా ఇప్పుడు ఎటు చుసిన  నీళ్లు  కనిపిస్తున్నాయి.  రాష్ట్ర మంత్రి  కేటీఆర్ కృషి  ఫలితమె మాకు ఇంత మంచి నాయకుడు దొరికినందుకు రైతులతరపున  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూన్నాము. పుష్కలంగా భూ గర్భజలాలు పెరిగినందున ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నర్మాల ఎగువ మానేరు శాశ్వతంగా జలకళ తో నిండు కుండల మార బోతుంది. అని  చెప్పండానికి  సంతోషంగా  మూడు మండలాలు నాయకులు ఎగువ మానేరు లో కేసీఆర్, కేటీఆర్  చిత్ర పటాలకు పాలాభిషేకం  చేసినారు. కార్యక్రమం  టెస్కాబ్ చేర్మెన్ కొండూరు రవీందర్ రావు, ఎంపీపీ  వంగ కరుణ సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ  కొమిరి చెట్టి విజయ లక్ష్మన్, తెరాస మండల అధ్యక్షులు  వెంకట్ స్వామి,  మండలం రైతు బందు సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్,  జడ్పీ కోఅప్షన్  అహ్మద్, గుండ్య డపు రాజు, కమలాకర్, టీఆరెఎస్  మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల రాయనర్సు,  టీఆరెఎస్  నాయకులు  ప్రజలు ప్రజా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...