ఎంపీ, ఎంవీవీ నీ కలిసిన మేయర్ గొలగాని దంపతులు మరియు డిప్యూటీ మేయర్ జి.శ్రీధర్ లు
మహారాణి పేట, పెన్ పవర్విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ని జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి దంపతులు డిప్యూటీ మేయర్ జి.శ్రీధర్ లు లాసన్స్ బే కాలనీ లో ఉన్న పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విశాఖ ఎంపీ వారికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోనే జీవీఎంసీ ని ప్రథమ స్థానానికి తీసుకువచ్చే ప్రయత్నానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.ఈ క్రమంలో వారిని ప్రత్యేకంగా అభినందించి జీవీఎంసీ ని ఓ ఉన్నత మైన మార్క్ స్థాయికి తీసుకు వెళ్లేందుకు చేస్తున్న వారి కృషికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.మేయర్ డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ జీవీఎంసీ అభివృద్ధికి తగు ప్రణాళికను సిద్ధం చేసి ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు.
No comments:
Post a Comment